నరాల బలహీనత ఉన్న వారు ఖ‌చ్చితంగా ఆ బియ్యం తినాల‌ట‌..తెలుసా?

నరాల బలహీనత.ఇటీవ‌ల కాలంలో చాలా మందిలో క‌నిపించే స‌మ‌స్య ఇది.

న‌రాల‌కు ఏదైనా గాయం కావ‌డం, మ‌ధుమేమం, స్ట్రోక్‌, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల న‌రాలు బ‌ల‌హీనంగా మారిపోతాయి.

దాంతో ఏ చిన్న బరువు లేపినా చేతులు జివ్వుమ‌ని లాగేయడం, కొంత దూరం నడవగానే కాళ్లు వ‌ణికి పోవ‌డం, ఏ ప‌నీ చేయ‌లేక పోవ‌డం, తిమ్ముర్లు, తీవ్ర‌మైన అల‌స‌ట‌, కండ‌రాల నొప్పులు ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.

వీట‌న్నిటినీ త‌గ్గించుకుని న‌రాల బ‌ల‌హీన‌త‌ను నివారించుకోవాల‌నుకుంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

అటువంటి వాటిల్లో న‌ల్ల బియ్యం ఒక‌టి.కానీ, చాలా మందికి అసలు న‌ల్ల బియ్యం గురించే తెలియ‌దు.

నిజానికి మిగతా రకాల బియ్యం కంటే న‌ల్ల బియ్యంలోనే పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి.

కాల్షియం, మెగ్నిషియం, ఇనుము, జింక్, విటమిన్ ఇ, ఫైబ‌ర్ వంటి పోష‌కాల‌తో పాటు న‌ల్ల బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు సైతం పెద్ద మొత్తంలో కనిపిస్తాయి.

అందుకే న‌ల్ల బియ్యం డైట్‌లో ఉండే ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు అందుతాయి.ముఖ్యంగా న‌రాల బ‌ల‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో న‌ల్ల బియ్యం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

తెల్ల బియ్యంకు బ‌దులుగా రోజూ న‌ల్ల బియ్యం తీసుకుంటే.బ‌ల‌హీన ప‌డిన న‌రాలు బ‌లంగా మార‌తాయి.

కండ‌రాల నొప్పులు దూరంగా అవుతాయి. """/"/ అంతేకాదు, న‌ల్ల బియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల‌.

బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.

ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి.గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

కంటి చూపు పెరుగుతుంది.ఇత‌ర కంటి సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

మ‌రియు అధిక ర‌క్త పోటు స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.కాబ‌ట్టి, న‌రాల బ‌ల‌హీన‌త ఉన్న వారే కాదు.

అంద‌రూ న‌ల్ల బియ్యాన్ని డైట్‌లో చేర్చుకోవ‌చ్చు.

Elon Musk : న్యాయపోరాటంలో ఆర్ధిక ఇబ్బందులు .. భారత సంతతి వైద్యురాలికి అండగా నిలిచిన ఎలాన్ మస్క్