గత ఏడాది ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో జీవం పోసుకున్న అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టు ముట్టేసిన సంగతి తెలిసిందే.
ఈ మహమ్మారిని అడ్డుకునే వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రతి రోజు లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు.
ఇక ఓవైపు కరోనా.మరోవైపు వర్షాకాలం కావడంతో.
జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు చాలా మందిని తెగ ఇబ్బంది పెడుతున్నాయి.
అయితే నల్ల మిరియాలు ఈ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.అదెలానొ ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గు, గొంతు నొప్పితో బాధపడేవారు నల్ల మిరియాలను పొడి చేసి.గోరు వెచ్చని నీటిలో కలుపి తీసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేయడం వల్ల త్వరగా దగ్గు, గొంతు నొప్పి తగ్గుముఖం పడతాయి.
అలాగే ఒక గ్లాసు గోరు వచ్చిని పాలలో నల్ల మిరియాల పొడి, తేనె కలిపి.
ప్రతి రోజు తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల జలుబు సమస్య దూరం అవుతుంది.