జాత్యహంకార తూటా కి మరో నల్లజాతీయుడు బలి..!!!

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో లెక్కకి మించిన జాత్యహంకార హత్యలు, దాడులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రటిక్ కి ఈ ఎన్నికల్లో ఆయుధంగా దొరికిన జాత్యహంకార నినాదానికి తాజా పరిణామాలు తోడవుతున్నాయి.

కొద్ది రోజులుగా నల్లజాతీయులపై జరుగుతున్నా దాడుల వార్తలు అమెరికా వ్యాప్తంగా హోరెత్తుతుంటే.మరో సారి జాత్యహంకార తూటాకి మరో నల్లజాతి యువకుడు బలైపోయిన ఘటన సంచలనం సృష్టిస్తోంది, ట్రంప్ వర్గంలో కలవరం రేపుతోంది.

గడించిన రెండు నెలల కాలంలో జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఎంతో మంది నల్లజాతీయుడు అమెరికా పోలీసుల తూటాలకి బలై పోయారు.

తాజాగా 18 ఏళ్ళ డియోన్ అనే నల్లజాతి యువకుడిని పోలీసులు అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు.

ఈ ఘటన అంతా పోలీసుల బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.ఈ ఘటన ఎలా జరిగిందంటే.

పోలీసులు ముందుగా ఓ ఇంటి వద్దకి వెళ్ళడంతో అక్కడ ఉన్న డియోన్ వారిని చూసి పరుగులు పెడుతూఉంటాడు, ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి దోయోన్ చాతిపై కాల్పులు జరపడంతో అతడు కుప్ప కూలిపోయాడు.

అయితే ఈ ఘటన రికార్డ్ అయిన తరువాత కొంత సేపు వీడియో కనపడదు, ఆ తరువాత డియోన్ తనవద్ద ఉన్న తుపాకి ని దూరంగా విసిరేయడం కనిపిస్తుంది.

అయితే అసలు గన్ డియోన్ వద్ద ఎందుకు ఉంది, పోలీసులు అతడిని ఎందుకు చంపారు అనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు.

ఒక వేళ అతడు తప్పు చేసి ఉన్నట్లయితే అతడిని చంపాల్సిన అవసరం లేదు పట్టుకుని కస్టడీలోకి తీసుకోవచ్చు కదా అంటూ నల్లజాతీయుల తరపున పోరాడుతున్న ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇదిలాఉంటే యువకుడిని కాల్చి చంపిన పోలీసు అధికారి అలెగ్జాండర్ ప్రస్తుతం సెలవులో ఉన్నాడని స్థానిక మీడియా తెలిపింది.

కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో వరుసగా నల్లజాతీయులపై దాడులు జరగడం అనుమానాలని రేకెత్తిస్తున్నా ఈ పరిణామాలు ట్రంప్ కి భారీ నష్టాని తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

ఏపీలో వచ్చేది కూటమి సర్కారే..: కిరణ్ కుమార్ రెడ్డి