అమెరికా నిరసనలతో దద్దరిల్లుతున్న వేళ సంచలన నిజం: జార్జ్ ఫ్లాయిడ్‌కు కరోనా

జార్జ్ ఫ్లాయిడ్.ప్రస్తుతం ఇతని పేరు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.

శ్వేతజాతి పోలీసుల చేతిలో అతను హత్యకు గురికావడంతో అగ్రరాజ్యం అట్టుడికిపోతోన్న సంగతి తెలిసిందే.

నిరసనకారుల ఆందోళనలు వాషింగ్టన్ సహా 150 నగరాలను వణికిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి పరిస్దితుల నేపథ్యంలో ఓ సంచలన నిజం వెలుగులోకి వచ్చింది.

జార్జ్ ఫ్లాయిడ్‌కు కోవిడ్ 19 సోకి వుందని తేలింది.అతని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.

హెన్నిపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ ఫ్లాయిడ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన తర్వాత, ఆయన కుటుంబసభ్యుల అనుమతితో 20 పేజీల పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు.

కోవిడ్ 19 వున్నప్పటికీ, ఎలాంటి లక్షణాలు లేని అసింప్టోమాటిక్‌గా తేలిందన్నారు.అలాగే పోలీసుల చేతుల్లో హత్యకు గురైన తర్వాత కూడా ఫ్లాయిడ్ ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయని చెప్పారు.

అయితే ఫ్లాయిడ్ గుండెలోని ధమనులు సంకుచితంగా ఉన్నాయని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ స్పష్టం చేశారు.

"""/"/ కాగా జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై పోలీసులు గతంలో ఇచ్చిన నివేదికను బేకర్ తప్పుబట్టారు.

ఆ రిపోర్టులో బాధితుడికి శ్వాసకోశ మాంద్యం, మూర్చ వంటి లక్షణాలు ఉన్నట్లుగా ప్రస్తావించారని.

కానీ తమ నివేదికలో అలాంటి లక్షణాలేవి కనిపించలేదని ఆండ్రూ వెల్లడించారు.మరోవైపు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అనేకమంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.ఈ సంఘటనను భయంకరమైనదిగా, క్షమించరానిదంటూ వ్యాఖ్యానించారు.

నిరసనకారుల పోరాటాన్ని తాను అర్ధం చేసుకోగలనని.అయితే ఇవి చట్టబద్ధంగా, సహేతుకంగా ఉండాలని జాన్సన్ అభిప్రాయపడ్డారు.

టీచర్ దెబ్బకు శాశ్వతంగా కాళ్లు పోగొట్టుకున్న బాలుడు.. మ్యాటరేంటంటే?