ఉద్యోగాలు పీకేస్తున్నారని ఆఫీసు గుమ్మానికే చేతబడి.. కలకలం రేపుతున్న క్షుద్రపూజల సామాగ్రి..
TeluguStop.com
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) బెల్లారి ఆఫీస్ దగ్గర ఓ భయానక సంఘటన వెలుగు చూసింది.
ఆ ఆఫీసు ముందు బ్లాక్ మ్యాజిక్ చేసినట్లు కొన్ని వస్తువులు కనిపించడంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
నల్లటి బొమ్మ, మేకులు కొట్టిన గుమ్మడికాయ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు లాంటి భయానక వస్తువులన్నీ అక్కడ కనిపించాయి.
చిన్న కుండలాంటి దాని చుట్టూ దారం కట్టి ఉంది.కొబ్బరికాయకు తాయెత్తు కూడా తగిలించి ఉంది.
అంతేకాదు, ఒక మూతపై కొన్ని గుర్తులు, రాతలు కూడా ఉన్నాయి.అన్ని వస్తువులకూ కుంకుమ రాసి ఉంది, నిమ్మకాయలు, గుమ్మడికాయలకు మేకులు గుచ్చడం మరింత గగుర్పాటుకు గురిచేసింది.
ఆఫీసులో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉన్నా , ఎవరూ ఈ వస్తువులు పెడుతుండగా చూడలేదు.
సెక్యూరిటీ స్టాఫ్ కూడా తాము ఎవరినీ చూడలేదని చెప్పారు.మరి ఇంతకీ ఈ పాడు పని చేసింది ఎవరు? అని అందరూ గందరగోళంలో పడ్డారు.
"""/" /
ప్రస్తుతం KMF ఆర్థికంగా నష్టాల్లో ఉంది.దాదాపు 50 మంది ఉద్యోగులను తీసేయాలని కూడా చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో, KMF డైరెక్టర్ ప్రభు శంకర్ దీని వెనుక ఉద్యోగుల కోపం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
బహుశా ఉద్యోగం పోతుందనే భయంతో ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. """/" /
మరికొందరేమో ఇది రాజకీయ కుట్ర అయి ఉండొచ్చని అంటున్నారు.
అధికారం కోసం ఎవరైనా ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చని వాదిస్తున్నారు.కానీ, దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.
ఈ ఘటనతో KMF ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.ఆఫీసులో నెలకొన్న పరిస్థితులు, మూఢనమ్మకాల గురించి చర్చలు మొదలయ్యాయి.
ప్రస్తుతానికి ఈ మిస్టరీ మాత్రం వీడలేదు.దీని వెనుక ఉన్న అసలు దోషి ఎవరో తెలుసుకోవడానికి విచారణ జరుగుతోంది.
ఈ ఘటన KMF ఉద్యోగుల్నే కాకుండా స్థానికులను కూడా కలవరానికి గురిచేస్తోంది.
అనారోగ్యానికి గురైన సాయి పల్లవి… విశ్రాంతి తప్పనిసరి అంటున్న వైద్యులు!