తెల్ల జుట్టా..న‌ల్ల జీల‌క‌ర్ర‌తో చెక్ పెట్టండిలా?

ఈ మ‌ధ్య కాలంలో యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న వారు విప‌రీతంగా పెరిగి పోతున్నారు.

ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, మ‌ద్య‌పానం, స్మోకింగ్‌, పోష‌కాల లోపం, జన్యుపరమైన స‌మ‌స్య‌లు, హార్మోన్ల అసమతుల్యత ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల న‌ల్ల జుట్టు తెల్ల‌గా మారిపోతుంటుంది.

ఇక ఈ స‌మ‌స్య‌ను ఎలా నివారించుకోవాలో తెలియ‌క‌.హెయిర్ క‌ల‌ర్స్ వాడుతూ తిప్ప‌లు ప‌డ‌తారు.

అయితే కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ పాటిస్తే సులువుగా వైట్ హెయిర్‌ను నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా న‌ల్ల జీల‌క‌ర్ర తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి న‌ల్ల జీల‌క‌ర్ర‌ను హెయిర్‌కు ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్లు న‌ల్ల జీల‌క‌ర్ర‌, రెండు స్పూన్లు ఎండ బెట్టుకున్న ఉసిరి కాయ‌ల పొడి మ‌రియు కొబ్బ‌రి నూనె వేసి బాగా హిట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ నూనెను చ‌ల్లార‌నిచ్చి వ‌డ‌బోసుకోవాలి.ఇప్పుడు ఈ నూనెను మీరు వాడే హెయిర్ ఆయిల్‌కు బ‌దులుగా వాడాలి.

త‌ల‌కు, కుదుళ్ల‌కు, కేశాల‌కు ఈ నూనెను బాగా ప‌ట్టించి.కొంత స‌మ‌యం పాటు వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్ల‌బ‌డుతుంది. """/" / అలాగే న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకుని డ్రై రోస్ట్ చేసి.

ఆ త‌ర్వాత మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల న‌ల్ల జీల‌క‌ర్ర పొడి, రెండున్న‌ర స్పూన్ల పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, శిరోజాల‌కు అప్లై చేయాలి.గంట లేదా రెండు గంట‌ల పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉంటే షాంపూతో హెడ్ బాత్ చేయండి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు స‌మ‌స్య దూరం అవుతుంది.

రోజూ ఈ జ్యూస్ తాగండి.. నాజూగ్గా మారండి..!