నర్మాల డ్యామ్ వద్ద పూజలు చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల సమీపంలోని ఎగువ మానేరు జలాశయం మత్తడి ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది.
మానేరు జలాశయంను బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మత్తడి వద్ద బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి టెంకాయలు కొట్టి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు, మొక్కలు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హామీద్ మాట్లాడుతూ ఎగువ మానేరు జలాశయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందన్నారు.
రుణమాఫీ కానీ రైతులకు రైతుల పక్షపాతి అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిరిసిల్ల(Revanth Reddy, Sirisilla) శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి(Mahender Reddy) లతో మాట్లాడి రుణమాఫీ చేయిస్తామన్నారు.
వర్షాలు పడడం కొంత ఆలస్యం అయితే దానిని ప్రతిపక్షాలు రాజకీయం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేశారని వానదేవుడు కరుణించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు చెరువు కుంటలు అన్ని నిండి రాష్ట్రమంతా సస్యశ్యామలం అయిందని వాన దేవునికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిందలు వేయడం మానుకొవాలని మంచిని మంచి అనడం చెడును చెడు అనడం నేర్చుకోవాలన్నారు.
ఒకరిద్దరి కి రుణమాఫీ జరగకపోతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని రెచ్చగొట్టి రుణమాఫీ జరగడం లేదని ఆరోపించడం వాళ్లంతా మూర్ఖులు దేశంలో ఎవరూ లేరని వారు విమర్శించారు.
గంగమ్మ తల్లి పూజా కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మిరి శెట్టి తిరుపతి,నాయకులు కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి,నర్మాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తుందా.. ఇలా చేశారంటే దెబ్బకు పరార్!