క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు.. ఈ ఆహారం తింటే ప‌రార్‌!

క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు లేదా డార్క్ స‌ర్కిల్స్‌.నేటి ఆధునిక కాలంలో చాలా మందిని ఈ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది.

ఎంత అందంగా, తెల్ల‌గా, కాంతివంతంగా ఉన్నా.క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఉంటే అంద‌హీనంగా క‌నిపిస్తారు.

అయితే అందాన్ని పాడు చేసే ఈ న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను త‌గ్గించేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ర‌క‌ర‌కాల క్రీములు, ప్యాకులు వేసుకుంటారు.అయితే పై పై పూసుకునే ప్యాకులు క‌న్నా.

కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోడం ద్వారా త్వ‌ర‌గా న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

క‌ల్ల కింద ఉన్న న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను త‌గ్గించ‌డంలో పుచ్చ‌కాయ ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

పుచ్చ‌కాయ రుచిలోనే కాదు.బోలెడ‌న్ని పోష‌కాలు అందించ‌డంలోనూ ముందుటుంది.

ముఖ్యంగా త‌ర‌చూ పుచ్చ‌కాయలు తీసుకోవ‌డం వ‌ల్ల డార్క్ స‌ర్కిల్స్‌ త్వ‌ర‌గా త‌గ్గుతాయి.అలాగే బొప్పాయి తీసుకున్నా న‌ల్ల‌టి వ‌ల‌యాలకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

బొప్పాయిలో సహజంగా లభించే బ్లీచింగ్ ఎజెంట్ డార్క్ స‌ర్కిల్స్‌ను నివారించ‌డంతో పాటు చ‌ర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగు ప‌రుస్తుంది.

"""/"/ కీర దోస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.మ‌రియు క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను కూడా దూరం చేస్తుంది.

నీటి శాతం అధికంగా ఉండే కీర‌దోస తీసుకుంటే.శ‌రీరంలో వేడి త‌గ్గి న‌ల్ల‌టి వ‌ల‌యాలు దూరం అవుతాయి.

అలాగే అనేక పోష‌కాలు దాగి ఉండే బీట్ రూట్‌ను జ్యూస్ రూపంలో లేదా డైరెక్ట్‌గా తీసుకోవ‌డం చేస్తే.

డార్క్ స‌ర్కిల్స్ త‌గ్గుముఖం ప‌డ‌తాయి.క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను నివారించ‌డంలో నల్ల ద్రాక్షకూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, డార్క్ స‌ర్కిల్స్ ఉన్న వారు త‌ర‌చూ బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటే మంచిది.

ఇక వీటితో పాటుగా వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.శ‌రీరం హైడ్రేటెడ్‌గా లేకున్నా క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, వాట‌ర్‌ను కూడా ఎక్కువ‌గా తీసుకోవాలి.

ధనుష్ కొత్త టార్గెట్ ఏంటి అంటే..?