తెలంగాణ బీజేపీ నాయకత్వంపై బీజేవైఎం అసంతృప్తి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై బీజేవైఎం తీవ్ర అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బీజేవైఎం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు.

రాష్ట్ర బీజేపీ తమను పట్టించుకోవడం లేదని బీజేవైఎం నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో జనసేనతో పొత్తు అంశంపై స్పందించిన బీజేవైఎం నేతలు బలంలేని జనసేనతో పొత్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కనీసం పది స్థానాలు అయిన కేటాయించాలని డిమాండ్ చేశారు.

అయితే తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటికే పొత్తును ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే జనసేనకు తొమ్మిది స్థానాలు ఇచ్చేందుకు సమాయత్తం అయింది.

విడుదలైన బన్నీ… భర్తను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి!