బీజేపీ ట్రిపుల్ ధమాకా !
TeluguStop.com
దేశ వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడుతో బహిర్గతం కానున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు గాను మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్.వంటి రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యంతో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది.
మిజోరాంలో అక్కడి ష్టానిక పార్టీ అయిన ఏంఎన్ఎఫ్ పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది.కాగా మొత్తానికి ఐదు రాష్ట్రాలకు గాను మూడింట్లో బీజేపీ ( BJP )అధికారం దిశగా అడుగులు వేస్తుండడంతో కమలనాథులు ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.
"""/" / కాగా రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభావం గట్టిగా ఉన్నప్పటికి ఆ రాష్ట్ర ప్రజలు అధికారం మార్పు వైపు మొగ్గుచూపడం హస్తం పార్టీని కలవరపెట్టె అంశం.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా వాటిని తలకిందులు చేస్తూ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ సత్తా చాటుతుండడం గమనార్హం.
ఇక మొదటి నుంచి అందరూ ఊహించినట్లుగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా అడుగులు వేస్తోంది.
"""/" /
ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగానే ప్రభావం చూపే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మూడు రాష్ట్రాల్లో అధికారం దిశగా అడుగులు వేస్తున్న బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామాలు మంచి జోష్ నిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
కాగా ఐదు రాష్ట్రాలకు గాను నాలుగు రాష్ట్రాల్లో విజయం తథ్యం అని మొదటి నుంచి కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ కు ఈ ఫలితాలు నిరాశ పరిచే అవకాశం ఉంది.
మరి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ పార్టీపై ఎంతమేర ఉంటాయో ముందు రోజుల్లో తేలనుంది.
నెలకు రెండు సార్లు ఇలా చేశారంటే తెల్ల జుట్టు మీ వంక కూడా చూడదు..!