ఆ రెండు పార్టీలతో పొత్తు కు బీజేపీ ప్లాన్  ? 

తెలంగాణలో కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామనే నమ్మకంతో బిజెపి ఉంది.బీఆర్ఎస్,  కాంగ్రెస్ ( BRS Congress )ప్రభావం ఎక్కువ కనిపిస్తున్నా,,  కచ్చితంగా తెలంగాణలో హాంగ్ ఏర్పడే అవకాశం ఉందని బిజెపి అంచనా వేస్తోంది .

హంగ్ ఏర్పడినా, బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నమ్మకంగా చెబుతూ ఉండడం తో , అదెలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే పొత్తుల ద్వారా అధికారంలోకి రావాలనే ప్లాన్ తో బీజేపీ ఉన్నట్లుగా అర్థమవుతుంది.

ఇప్పటికే జనసేనతో ఏపీలో బిజెపి( BJP ) పొత్తు పెట్టుకుంది.దానిని తెలంగాణ వరకు తీసుకువెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఇక బిజెపితో పొత్తు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా , బిజెపి అగ్రనేతలు టిడిపి ( TDP )విషయంలో అంత సానుకూలంగా లేరు.

అయితే ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ టిడిపితో పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయంలో బిజెపి నేతలు ఉన్నారట.

"""/" / ఈరోజు నామినేషన్లకు చివరి రోజు.దీంతో పొత్తుల వ్యవహారంపై ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈరోజే సీట్ల సర్దుబాటు కూడా చేసుకుంటారని సమాచారం .ఇది వాళ్ళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు.

 ఆ తర్వాత కిషన్ రెడ్డితో సమావేశం అయ్యి పొత్తులపై చర్చలు జరిపారు.బిజెపి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లే కన్నా , జనసేన , టిడిపిని( Janasena TDP ) కలుపుకుని వెళ్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయని బిజెపి నేతలు భావిస్తున్నారు.

"""/" / బీఆర్ఎస్ ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్న వారంతా తమ వైపు చూస్తారని , అలాగే ఇటీవల చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తెలంగాణలోనూ టిడిపి యాక్టివ్ అయిందని టిడిపి సానుభూతిపరులంతా బిజెపి వైపు వస్తారని,  ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట .

అందుకే జనసేన,  టిడిపి సానుభూతిపరుల ఓట్లను బిజెపి వైపుకు డైవర్ట్ చేసేందుకు ఆ రెండు పార్టీలతో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచార .

అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!