నెక్స్ట్ టార్గెట్ బిహార్.. నితీశ్ కు ముప్పే ?

ఈ మద్య మహారాష్ట్ర రాజకీయాలు( Politics Of Maharashtra ) ఎంతటి హాట్ టాపిక్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా బీజేపీ( BJP ) వ్యూహాలతో ఇతర పార్టీలకు పెను ముప్పే పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ అండతో ఏక్ నాథ్ షిండే ( Ek Nath Shinde )శివసేన పార్టీలో చీలిక తెచ్చిన సంగతి విధితమే.

ఆ తరువాత పార్టీ పూర్వ వైభవం పూర్తిగా కోల్పోయింది.ఇక ఆ తరువాత ఇప్పుడు మరో ప్రధాన పార్టీ ఎన్సీపీలో కూడా అజిత్ పవర్( Ajith Power ) కారణంగా చీలిక ఏర్పడడంతో ఎన్సీపీ కూడా నిర్వీర్యం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.

ఇలా ప్రధాన పార్టీలన్నీ తీవ్ర సంక్షోభానికి గురి కావడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం.

"""/" / ఇప్పుడు బీజేపీ కన్ను బిహార్ పై పడినట్లు తెలుస్తోంది.బిహార్ లో కూడా మహారాష్ట్ర తరలోనే నితీశ్ కుమార్( Nitish Kumar ) అధ్యక్ష వహిస్తున్న జేడీయూ పార్టీని గుప్పిట్లోకి తెచ్చుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి అధికారం చేపట్టారు నితిశ్ కుమార్ కానీ ఏడాది గడవక ముందే ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడి తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు నితీశ్ కుమార్.

అప్పటి నుంచి జేడీయూలో చీలిక తెచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది బీజేపీ అధిష్టానం. """/" / ఇక తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ సెంగ్ చేసిన వ్యాఖ్యలు జేడీయూ పార్టీలో( JDU Party ) తీవ్ర కలకాలాన్ని రేపుతున్నాయి.

జేడీయూ పార్టీకి చెందిన చాలమంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.వారంతా ఏ క్షణమైన బీజేపీలో చేరతారని వ్యాఖ్యానించడంతో అధినేత నితీశ్ కుమార్ అలెర్ట్ అయ్యారు.

ఎమ్మేల్యేలు పక్కాచూపులు చూడకుండా దిద్దుబాటు చర్యలకు సిద్దమయ్యారు.జేడీయూ తో అటు ఆర్జేడి ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అరవింద్ సెంగ్ చెప్పడంతో అటు జేడీయూ ఇటు ఆర్జేడిలో అంతర్మధనం మొదలైంది.

ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం లేకపోలేదనే భయం ఆ రెండు పార్టీలను వెంటాడుతోంది.

కాగా మహారాష్ట్ర తరహా వ్యూహాలు బిహార్ లో కూడా పక్కాగా అమలైతే బిహార్ లో బీజేపీ ఏకపక్షంగా వ్యవహరించడం ఖాయం మరి ఏం జరుగుతుందో చూడాలి.

పుష్ప ది రూల్ ఫస్ట్ డే టార్గెట్ అన్ని రూ.కోట్లా.. ఆ తప్పు మాత్రం మైనస్ కానుందా?