ధీధి ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమేనా ?

ప్రభుత్వాలను కూల్చుతాం కాషాయ జెండా ఎగుర వేస్తాం అని చెప్పడం కమలనాథులకు కొత్తేమీ కాదు.

బీజేపీ( Bjp ) యేతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను ఉద్దేశించి కమలనాథులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు.

అయితే ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడం ప్రజాస్వామ్య బద్దం.కానీ అలా కాకుండా ప్రజలు ఏర్పరచిన ప్రభుత్వాలను కూల్చి ఆ ప్లేస్ లో కాషాయ జెండా ఎగరాలని ఆశించడం ముమ్మాటికి అప్రజాస్వామ్యమే అవుతుంది.

అయినప్పటికి బీజేపీ నేతలు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ.అక్రమ చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.

మహారాష్ట్రలో శివసేన థాక్రే ( Shiv Sena Thackeray )ప్రభుత్వానికి కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.

"""/" / ఇదే వ్యూహాన్ని బీజేపీ యేతర రాష్ట్రాలలో అమలు చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

అందుకే ప్రతి బీజేపీ యేతర రాష్ట్రంలోనూ ఏక్ నాథ్ షిండే( Ek Nath Shinde )లను పుట్టిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు బీజేపీ నేతలు.

"""/" /అయితే ఏక్ నాథ్ షిండే వ్యూహం ఆయా రాష్ట్రాలలో మాత్రం బెడిసికొడుతోంది.

ప్రస్తుతం బిహార్ లో అధికారంలో ఉన్న జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చి అధికారం దక్కించుకోవాలని చూసిన కమలం పార్టీకి జేడీయూ అధినేత నితీశ్ కుమార్( Nitish Kumar) షాక్ ఇచ్చి ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు.

అదే వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలుచేయాలని ఎమ్మెల్యేలకు డబ్బు ను ఎర వేసిన కమలనాథుల వ్యూహాలను తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పటాపంచలు చేశారు.

"""/" / ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో కూడా ఏక్ నాథ్ షిండే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది బీజేపీ.

ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇదే అర్థమౌతోంది.

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చుతామని అమిత్ షా చెప్పుకొచ్చారు.

దేశ రాజకీయాల్లో బీజేపీ ఓటు బ్యాంకు ను ప్రభావితం చేయగల నేతల్లో మమతా బెనర్జీ కూడా ఒకరు.

అలాంటి దీధి ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమేనా ? అంటే అంత తేలికైన విషయం కాదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

ఒకవేళ బీజేపీ అలాంటి వ్యూహాలు రచించి చేతులు కాల్చుకోవడమే తప్పా.జరిగేదెమి లేదనేది కొందరి మాట.

మరి ఏక్ నాథ్ షిండే వ్యూహం బీజేపీకి పశ్చిమ బెంగాల్ లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

అందుకే ‘ పల్లా ‘ కు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు