రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీకి కొత్త చీఫ్‎లు..!

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది.

ఈ వ్యవహారంపై తీవ్ర కసరత్తు చేసిన పార్టీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ వ్యవహారించనున్నారు.అటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి నియామకం అయ్యారు.

అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికింది.

వీరి పేర్లను అధికారికంగా ప్రకటించిన పార్టీ అధిష్టానం త్వరలోనే ప్రమాణస్వీకారం ఏర్పాట్లు చేయనుందని తెలుస్తోంది.

చైనాలో విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే అన్ని రూ.కోట్లా?