బీజేపీ మాస్టర్ ప్లాన్.. మరి పవన్ సంగతి ?

ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఒకవైపు చంద్రబాబు చుట్టూ అరెస్ట్ ల పర్వం మరోవైపు పొత్తుల అంశం ఇలా ప్రతి పరిణామం కూడా రాజకీయ వేడిని పెంచుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్కిల్ స్కామ్ లో రిమాండ్ కు వెళ్ళిన తరువాత అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు జనసేనాని.

కానీ బీజేపీ కూడా ఈ పొత్తులో భాగమేనా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మరోవైపు జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని టీడీపీతో పొత్తు అంశం ఇప్పుడే చెప్పలేమని కమలనాథులు చెబుతున్నారు.

దీంతో అసలు మూడు పార్టీల కూటమి ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

"""/" / అయితే ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ( BJP ) మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు జైల్లో ఉండడంతో ఒకవేళ కూటమిగా ఏర్పడాల్సి వస్తే బీజేపీ అభ్యర్థినే సి‌ఎం అభ్యర్థిగా నిలబెట్టాలని కమలం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట.

పవన్ కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్నప్పటికి మోడితో పవన్ కు మంచి సన్నిహిత్యం ఉంది.

దీంతో సి‌ఎం అభ్యర్థి రేస్ నుంచి పవన్ ను విరమింపజేయాలని కమలనాథులు ప్రణాళికలు వేస్తున్నారట.

టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గా పురందేశ్వరిని నిలబెడితే పార్టీకి తిరుగుండదని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

"""/" / ప్రస్తుతం స్కామ్ లతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు వాటి నుంచి బయటపడలంటే కేంద్రం సహకారం అవసరం.

ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పొట్టుకోవడానికి పై ప్రతిపాదనను కండిషన్ గా పెట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.

పురందేశ్వరి( Daggubati Purandeswari )ని సి‌ఎం అభ్యర్థిగా ఒప్పుకుంటేనే టీడీపీతో పొత్తు, అలాగే చంద్రబాబును స్కామ్ ల నుంచి తప్పించడం.

రెండు చేస్తామని బీజేపీ పెద్దలు టీడీపీకి సిగ్నల్స్ పంపిస్తున్నారని ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిప్శితున్నాయి.

అయితే అధికారమే లక్ష్యంగా ఉన్న బీజేపీ కోరిక మేరకు సి‌ఎం అభ్యర్థిగా తప్పుకుంటారా లేదా అనేది కూడా సందేహమే.

మరి ఏది ఏమైనప్పటికి తాజా ఏపీ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు కమలనాథులు వ్యూహరచన చేస్తున్నట్లు టాక్.

అమానుషం.. బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టరమ్మ..