మ‌హారాష్ట్ర‌లో బీజేపీ మార్క్ పాల‌న మొద‌లైన‌ట్టే...!!

ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల త‌ర్వాత శివ‌సేన రెబ‌ల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాత శివ‌సేన రెబ‌ల్ ఏక్ నాథ్ షిండే.ముఖ్య‌మంత్రిగా.

మాజీ ముఖ్య‌మంతి బీజేపీ నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్నారు.

అయితే ఏక్ నాథ్ షిండే వ‌ర్గం మైనారిటీ అన్న విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలోనే పేరుకు మాత్ర‌మే ముఖ్య‌మంత్రి అని.

అధికారాలు అన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయ‌ని అంటున్నారు.దీంతో మహారాష్ట్రలో బీజేపీ మార్క్ పాలన మొదలైనట్లే ఉందంటున్నారు.

రెండు కీల‌క శాఖ‌లు బీజేపీకే.శివసేనలోని షిండే నాయకత్వంలోని చీలికవర్గం.

బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తంగా 106 మంది ఎమ్మెల్యేల‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మొద‌ట్లో బీజేపీ నేత‌కే ముఖ్య‌మంత్రి ప‌దవి క‌ట్ట‌బెడ‌తార‌ని అనుకున్నారంతా.కానీ అనూహ్యంగా ఏక్ నాథ్ షిండేను ముఖ్య‌మంత్రి చేశారు.

ఇక ఎప్పుడైతే బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరిందో అప్ప‌టి నుంచే షిండే కేవలం బొమ్మగా మాత్రమే ఉండిపోయార‌ని అంటున్నారు.

దానికి తగ్గట్లే దాదాపు 40 రోజులు మంత్రివర్గాన్నే ఏర్పాటు చేయలేకపోయారు.తీరా మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత శాఖలు కేటాయింపు చూస్తే షాకింగ్ కు గురిచేస్తోంది.

ఎంతో కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు రెండు డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ‌ద్ద ఉన్నాయి.

దీంతో కీల‌క శాఖ‌లు బీజేపీ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. """/"/ అయితే రెండు కీలక శాఖలను ఎప్పుడూ కూడా ఒకే మంత్రికి.

ముఖ్యమంత్రి కూడా తీసుకోరు.అలాంటిది ఇపుడు ఫడ్నవీస్ రెండింటిని తీసుకున్నారంటే సీఎంతో సంబంధం లేకుండా తానే కేటాయించేసుకున్నట్లు అర్ధమవుతోంది.

ఏ ప్రభుత్వంలో అయినా హోంశాఖ ఎంతటి ప్రాధాన్యత కలిగుంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ శాఖను ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితులకే కేటాయించుకుంటారు.శాంతి భద్రతలు సీఎం తనవద్దే ఉంచుకున్నా హోంశాఖను మాత్రం సన్నిహితులకే అప్పగిస్తారు.

అయితే ఇక్కడ షిండే, దేవేంద్ర అంత‌గా సన్నిహితులేమి కాదు.పైగా మొన్నటి వరకు బద్ధ విరోధమున్న పార్టీలకు ప్రతినిధులే.

అయితే హోంశాఖతో పాటు ఆర్థిక శాఖను కూడా బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

అయితే శాఖల కేటాయింపులో షిండే జోక్యం ఏమాత్రం ఉన్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు.తమకు కావాల్సిన ముఖ్యమైన శాఖల్లో చాలావరకు బీజేపీ తీసుకుని మిగిలిన శాఖలను మాత్రమే షిండే వర్గానికి ఇచ్చింద‌ని అంటున్నారు.

దీంతో ముందు ముందు కూడా షిండేకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?