మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన ఆయుధం: బీఎస్పీ

సూర్యాపేట జిల్లా: దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ఆదాని,అంబానీలకు కట్టబెట్టడమే బీజేపీ చెపుతున్న దేశభక్తి అని, బీజేపీ నిజస్వరూపాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని సూర్యాపేట జిల్లా బీఎస్పీ ఇంచార్జ్ రాపోలు నవీన్ కుమార్( Naveen Kumar Rapolu ) అన్నారు.

మంగళవారం నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచిందని, బీజేపీ( BJP )ని దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని, కర్ణాటక ఫలితాలతో ఆ విషయం బట్టబయలు అయిందన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటుందని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఉన్న నలుగురు బీజేపీ ఎంపీలను నిలబెట్టుకునే పరిస్థితిలో లేదన్నారు.

ఇప్పటికైనా తెలంగాణలో బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.

రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar ) నాయకత్వంలో బీఎస్పీ రోజురోజుకీ బలపడుతుందన్నారు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల తో పాటు అగ్రవర్ణాల్లోని నిరుపేదలంతా బీఎస్పీకి మద్దతు ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పి పార్టీ పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి,నియోజకవర్గ ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి,మండల అధ్యక్షులు తకెళ్ళ నాగార్జున,హుస్సేన్, పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సినిమాల్లో హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వారు వీరే !