ఏపీలో బీజేపీ మ‌హా ప్లాన్‌.. వ‌ర్కౌట్ అయ్యేనా..?

కండ్ల ముందు ఉన్న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని ప్ర‌తి రాజ‌కీయ పార్టీ ఆరాట ప‌డుతుంది.

ఈ కోవ‌లో బీజేపీ అన్నింటికంటే ముందు వ‌రుస‌లో ఉంటుంది.త‌మ‌కు ఏ చిన్న అవ‌కాశం దొరికినా దాన్ని అస్స‌లు విడిచి పెట్ట‌కుండా త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ప్ర‌చారం చేసుకుంటుంది.

ఇప్పుడు ఏపీలో కూడా ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తోంది.మొద‌టి నుంచి ఇక్క‌డ బ‌ల‌ప‌డేందుకు బాగా ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు ఓ బంప‌ర్ ఛాన్స్ వ‌చ్చింది.

ప్ర‌స్తుతం వైసీపీకి వ్య‌తిరేకంగా రాజ‌ధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మం చేస్తున్నారు.మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం జిల్లాకే ప‌రిమితం అయిన వారి ఉద్య‌మం కాస్తా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మ‌హా పాద‌యాత్ర రూపం దాల్చింది.

అయితే ఇన్ని రోజులు ఈ రైతులు ఉద్య‌మానికి రైతుల‌తో పాటు కేవ‌లం టీడీపీకి చెందిన వారే ఉన్నారు.

దీన్ని ఇన్ని రోజులు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న ఉద్య‌మంగా వైసీపీ చెప్పుకొచ్చింది.

కానీ ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ ఎంట‌ర్ అవ‌డానికి రెడీ అవుతోంది.మొన్న‌టి వ‌ర‌కు ఈ ఉద్య‌మం మీద ఎలాంటి నిర్ణ‌యం తెల‌ప‌ని బీజేపీ ఇప్పుడు ఎంట‌ర్ అవ‌డానికి ఓ కార‌ణం కూడా ఉంది.

అదేంటంటే మొన్న అమిత్ షా వ‌చ్చి దీనిపై దిశా నిర్దేశం చేశారంట‌. """/"/ రాష్ట్రంలో ఇంత పెద్ద ఉద్య‌మం జ‌రుగుతుంటే దానికి ఎందుకు సంఘీభావం తెల‌ప‌ట్లేద‌ని ప్ర‌శ్నించారంట‌.

దీంతో మంచి ముహుర్తం చూసుకుని ఎంట‌ర్ అవుతామ‌ని ఏపీ బీజేపీ నేత‌లు చెప్పేశారంట‌.

అంటే త్వ‌ర‌లోనే వారు నేరుగా ఉద్య‌మంలో పాల్గొనే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న‌మాట‌.ఒక‌వైపు కేంద్రం రైతు చ‌ట్టాల‌ను వెనక్కు తీసుకున్న ఎఫెక్ట్ ఎలాగూ జ‌గ‌న్ మీద కూడా ప‌డుతుంది కాబ‌ట్టి తాము చేసిన‌ట్టు జ‌గ‌న్ కూడా చేయాల‌ని ప్ర‌శ్నించే అవ‌కాశాలు బీజేపీకి ఉన్నాయి.

దీంతో బీజేపీకి మైలేజ్ పెరుగుతుందా లేదా అ‌ని మాత్రం వేచి చూడాలి.

ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్…