ఏపీలో రేపటి నుంచి బీజేపీ జోనల్ సమావేశాలు

ఏపీలో రేపటి నుంచి బీజేపీ జోనల్ సమావేశాలు జరగనున్నాయి.ఈ మేరకు రాష్ట్రంలోని నాలుగు జోన్లలో బీజేపీ శ్రేణులతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ క్రమంలోనే రేపు ప్రొద్దుటూరులో రాయలసీమ జోన్ శ్రేణులతో ఆమె భేటీ కానున్నారని సమాచారం.

అదేవిధంగా ఈనెల 25వ తేదీన గుంటూరులో కోస్టల్ ఆంధ్రా జోన్ శ్రేణులతో పురంధేశ్వరి సమావేశం కానున్నారు.

26న రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ శ్రేణులతో మరియు ఈనెల 27న విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ బీజేపీ శ్రేణులతో సమావేశం కానున్నారు.

బీజేపీ కేడర్ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్యాచరణను ఏపీ బీజేపీ ఈ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆ ఇద్దరు స్టార్ హీరోలు డైరెక్టర్లకు సరెండర్ అయితేనే వాళ్ళకి సూపర్ సక్సెస్ లు వస్తాయా..?