‘బండి’ని చూసి బోరుమన్న బిజెపి కార్యకర్త !

కొద్ది రోజుల క్రితమే తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్( Bandi Sanjay ) ను ఆ పార్టీ అధిష్టానం తప్పించింది.

ఆస్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.అయితే బిజెపి( BJP ) అధిష్టానం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడంతో , బండి సంజయ్ ను మార్చరని అంతా అంచనా వేశారు.

అయితే ఇటీవల కాలంలో బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ ( Etela Rajender )తో పాటు, మరి కొంతమంది కీలక నాయకులు బండి సంజయ్ తీరుపై అసహనం వ్యక్తం చేయడం, ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించకపోతే పార్టీ మారుతామనే హెచ్చరికలు చేయడం, సీనియర్ నాయకులు అనేకమంది ఆయనపై తరచుగా ఫిర్యాదులు చేయడం వంటి కారణాలతో సంజయ్ ను బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించారు .

"""/" / ఈ విషయంలో సంజయ్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

సంజయ్ కు బిజెపి అధ్యక్ష పదవి పోవడంపై అనేకమంది ఆయనకు ఓదార్పులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బిజెపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించిన తర్వాత మొదటిసారిగా ఆయన కరీంనగర్( Karimnagar_ కు ఈరోజు వచ్చారు.

మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్( MLA NVS Prabhakar ) తో కలిసి మహాశక్తి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ బిజెపి కార్యకర్తగా ఉన్న బండి సంజయ్ అభిమాని సంజయ్ ను పట్టుకుని ఏడ్చాడు.

"""/" / బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్ ను తొలగించడం పై ఆ కార్యకర్త బోరుమన్నాడు.

ఈ హఠాత్పరిణామంతో బండి సంజయ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.దీంతో ఇతర కార్యకర్తలు ఆ కార్యకర్తను పక్కకు తీసుకువెళ్లి ఓదార్చేందుకు ప్రయత్నించారు .

ఈ ఘటన తర్వాత బండి సంజయ్ అక్కడి నుంచి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

మోకాళ్ల నొప్పితోనే తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!