ఈనెల 28న బీజేపీ విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణలో ఈ నెల 28వ తేదీన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!