టీఆర్ఎస్ పై మరింతగా ఫోకస్ చేయనున్న బీజేపీ... అసలు కారణం ఇదేనా

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి అధికారం చేపట్టాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీపై మరింతగా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గేది లేదన్నుట్టుగా వ్యవహారిస్తోంది.అయితే రానున్న రోజుల్లో ఇక సోషల్ మీడియా పరంగా కూడా ఇక మరింతగా విమర్శలు గుప్పించేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే సోషల్ మీడియా వారియర్స్ ను తయారు చేసేందుకు జిల్లాల వారీగా బీజేపీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బీజేపీ జాతీయ నేతలు కూడా తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రానున్న రోజుల్లో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా తెలంగాణలో రాజకీయం అనేది నడపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"""/"/ అయితే తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీ కాస్త బలపడిందనే విషయం బయటపడ్డ నేపథ్యంలో ఇక మరింతగా టీఆర్ఎస్ పార్టీపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది అయితే బీజేపీ మాత్రం ఇప్పటికే మిషన్-12 లాంటి వ్యూహాలను అమలు చేస్తూ గత ఎన్నికల కంటే మెరుగైన ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికే బీజేపీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల వాతావరణం రణరంగంగా మారే అవకాశం వందకు వంద శాతం కనిపిస్తోంది.

అయితే టీఆర్ఎస్ కూడా అప్పుడు ఎలాంటి రాజకీయ పరిస్థితులను ఊహించిందని అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏ విధంగా వ్యవహరిస్తుందో మనం మిగతా రాష్ట్రాల ఎన్నికల సమయంలో మనం చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది.

మరి అదేవిధంగా తెలంగాణలో వ్యవహరిస్తుందా అంతేకాక తెలంగాణలో కెసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా అనేది చూడాల్సి ఉంది.

గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే..?