రైతులకు బీజేపీ న్యాయం చేస్తుంది..: ఎంపీ లక్ష్మణ్
TeluguStop.com
ధరణి పోర్టల్ తప్పులపై బీజేపీ అనేక పోరాటాలు చేసిందని ఆ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
ఈ క్రమంలో ధరణి వ్యవహారంపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.అదేవిధంగా తెలంగాణలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు.
రైతులకు, ప్రజలకు తీరని అన్యాయం చేసిన బీఆర్ఎస్ ను మరోసారి నమ్మేందుకు సిద్దంగా లేరని పేర్కొన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని తెలిపారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.