కుల మత రాజకీయాలకు అతీతంగా జగన్ ను ఓడించాలీ - బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు
TeluguStop.com
విశాఖ: బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు కామెంట్స్.సీఎం జగన్ టాక్స్ వేయనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క గడ్డం మాత్రమే.
అందుకే నేను గడ్డం పెంచుతున్నాను.అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశలలో మద్యపానాన్ని నిషేధం చేస్తామన్నా జగన్ మద్యం షాప్ లను పెంచుతున్నరు.
మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయులను విధులలో పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం వైసిపి.రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ జగన్ ప్రభుత్వం పై తిరగబడాలి.
రాష్ట్ర మంత్రి మద్యనిషేధం మా నవరత్నాలు లో లేదు అని అంటున్నారు.కుల మత రాజకీయాలకు అతీతంగా జగన్ ను ఓడించడానికి అందరూ ముందుకు రావాలి.
అందాలకు నెలవు అయిన రుషికొండ ను నాశనం చేసి విశాఖ ప్రజల మనసులను కూల్చివేశారు.
ఋషికొండా లో జరుగుతున్న పనులను పరిశీలించడానికి వెళ్తున్నవారిని అడ్డుకుంటున్నారు ,కేసులు పెడుతున్నారు.ఋషికొండా ప్రాంతంలో అసలు ఏం కోరుతున్నారో ప్రభుత్వం చెప్పాలి.
దయచేసి రాష్ట్రంలో మూడు రాజధానులు వద్దు.అవసరమైతే మీ కడప లో పెట్టుకోండి.
వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి వస్తుంది.