బీజేపీకి సినీ వెలుగులు ? చిరంజీవి నాగార్జున ఇంకెవరు ?

గతంతో పోలిస్తే బీజేపీ ఏపీ తెలంగాణలో బలం పెంచుకున్నట్టుగా కనిపిస్తోంది.ముఖ్యంగా తెలంగాణకు బండి సంజయ్, ఏపీకి సోము వీర్రాజు అధ్యక్షులుగా నియామకం అయిన తరువాత ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.

వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే ఏకైక లక్ష్యంగా, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ముందుకు వెళుతోంది.

ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడింది.ఆ స్థానాన్ని ఆక్రమించి టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు , దుబ్బాక ఎన్నికలు ఉండడం ఇవన్నీ ప్రతిష్టాత్మకం కావడంతో, టిఆర్ఎస్ కు ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ అన్ని మార్గాలను చూసుకుంటోంది.

ఈ రెండు ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా, 2023 తెలంగాణ సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకుంటుంది అని ఆ పార్టీ నాయకులో ధీమా కనిపిస్తోంది.

అందుకే తెలంగాణ బీజేపీ నాయకులు అంతా ఏకాభిప్రాయంతో ఉంటూ, అధిష్ఠానం సూచనతో ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ పై పోరాటం చేస్తూ వస్తున్నారు.

 ఇదిలా ఉంటే బీజేపీకి గ్లామర్ తీసుకువచ్చేందుకు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

ఈ మేరకు సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పార్టీ లోకి తీసుకురావడం ద్వారా, ఆయన సినీ గ్లామర్ బీజేపీకి బాగా పనికొస్తుందని, స్టార్ క్యాంపెయినర్ గా ఆయన మారతారని బీజేపీ అభిప్రాయపడుతోంది.

ఈ మేరకు ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఇప్పుడు కొత్త ఎత్తులు వినిపిస్తున్నాయి. చిరంజీవితో పాటు, నాగార్జున మరి కొంత మంది సినీ ప్రముఖులను బీజేపీ లో చేర్చి, వారి హోదాకు తగిన విధంగా నామినేటెడ్ పోస్టులను ఇచ్చి, వారితో ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల నాటికి బలమైన పునాదులు వేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం .

ఇప్పటికే ఏపీ లో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తరుణంలో బీజేపీ ఆహ్వానం మేరకు తప్పనిసరిగా చిరంజీవి పార్టీ లోకి వస్తారని బీజేపీ అంచనా వేస్తోందట.

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నిరసన తెగ