కేసీఆర్ కంచుకోటలే బీజేపీ టార్గెట్టా?

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది.ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస పార్టీని వెనక్కి నెట్టి టీఆర్ఎస్ కు ధీటుగా పోరాడుతున్న బీజేపీ టీఆర్ ఎస్ మూలాలను దెబ్బ తీయడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

ఇందులో భాగంగానే దుబ్బాకను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ఎన్నికలో విజయం సాధించడం, ఆ తరువాత జీహెచ్ఎం సీ ఎన్నికలలో 99 సీట్లు సాధించి బలంగా ఉన్న టీఆర్ఎస్ ను దెబ్బతీసి 49 సీట్లకు ఎగబాకి టీఆర్ఎస్ ను పద్మవ్యూహంలోకి నెట్టినట్టయింది.

అంతేకాక ఇప్పుడు త్వరలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో కూడా బలంగా సత్తా చాటి క్షేత్ర స్థాయిలో కూడా సత్తా చాటాలనే బలమైన వ్యూహంతో స్వయంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే రంగంలోకి దిగి స్థానిక క్యాడర్ లో ఉత్సాహం నింపి ఈ ఎన్నికలలో గెలవడం బీజేపీకి ఎంత ప్రాధాన్యత అనే అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు.

ఏది ఏమైనా బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేస్తుండడం బీజేపీకి కలసి వచ్చే అంశం.

ఈ ఉత్సాహంతోనే టీఆర్ఎస్ కు ధీటుగా పోరాడుతున్నారనే చెప్పవచ్చు.చూద్దాం భవిష్యత్తులో ఎవరిది పై చేయి అవనున్నదో చూడాల్సి ఉంది.

అమ్మ కోరిక తీర్చాలని సివిల్స్ సాధించాడు.. నాగ భరత్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!