అన్ని కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు దిశగా బీజేపీ వ్యూహం?

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటలు తూటాలు పేలుస్తూ, టీఆర్ఎస్ కు ధీటుగా ముందుకెళ్తోంది.

అంతేకాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలనే ఆయుధాలుగా వాడుకుంటూ ప్రజల్లో మరింత బలపడేలా వ్యూహాలు రచిస్తోంది.

ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

కాని బీజేపీ కొద్ది సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడమే కాక అన్ని కార్పొరేషన్ లను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

ఈ కీలకమైన ఎన్నికలలో నెగ్గి ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే ఆలోచన ప్రజలకు కలిగిస్తే కొంత మేర వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు ఇది దోహద పడుతుంది.

ఏది ఏమైనా కేసీఆర్ వ్యూహాన్ని ఎవరు పసిగట్టలేరు కనుక ఎప్పుడు ఏ అస్త్రాన్ని కేసీఆర్ ప్రయోగిస్తారో తెలియదు.

ఒక వేళ అస్త్రం కనుక విజయం సాధిస్తే మరల వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ విజయం నల్లేరు మీద నడకే అని చెప్పవచ్చు.

ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవచ్చు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో, కార్పొరేషన్ ఎన్నికల్లో అవచ్చు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రసవత్తర పోరు ఉండే అవకాశం ఉంది.

ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారనేది చూడాల్సి ఉంది.

ఊహించని యాక్టర్లతో జతకట్టి షాకిచ్చిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..