స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్
TeluguStop.com
V.Subba Reddy ) అధ్యక్షణ చేత సోమవారం తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై బిజేపి అభ్యంతరం వ్యక్తం చేస్తుందని బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో భానుప్రకాష్( Bhanuprakash ) స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.తిరుచానూరులో 23 కోట్ల రూపాయలతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని టిటిడి నిలుపుదల చేయాలని, టీటీడీ( TTD) అనుబంధ ఆలయాల్లో టైమ్స్ స్లాట్ దర్శనాలు అమలు చేయాలన్నారు.
క్యూ కాంప్లెక్స్ అంచనా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.100 కోట్లతో నిర్మించిన పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ పరం చేయడం జరిగిందని విమర్శించారు.
టీటీడీకి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదని, టీటీడీ నిధులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మానుకోవాలని, రాజకీయ పునరావాస కేంద్రంగా టిటిడి పాలకమండలి మార్చకూడదని బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యతిరేకించారు.
అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!