ఈనెల 24న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈనెల 24న నిర్వహించనున్నారు.ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటుకానుంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఆగస్ట్ లో వస్తుందని భావిస్తోన్న బీజేపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని నిర్వహించనుంది.ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్ణయాలను బీజేపీ నేతలు రాష్ట్ర కమిటీకి వివరించనున్నారు.

రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు అధికారం చేపట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..