టీఆర్ఎస్ ధర్నాపై బీజేపీ సోషల్ మీడియా అస్త్రం...
TeluguStop.com
తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి.మునుపెన్నడూ లేని రీతిలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం చాలా వరకు టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఇక మూడో సారి అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నది.
అయితే ప్రస్తుతం చాలా వరకు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు పోటీ వస్తున్నా అంతగా ప్రభావం చూపడం లేదు.
అందుకు ప్రధాన కారణం హుజూరాబాద్ ఉప ఎన్నికనే ఉదాహరణగా చూసుకోవచ్చు.హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తరువాత రెండో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఏకంగా డిపాజిట్లు కోల్పోయిందంటే ఇక కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందనేది మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి స్థాయిలో కేంద్రం చేపట్టాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాలలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ ధర్నాను విఫలం చేయడానికి పెద్ద ఎత్తున బీజేపీ ప్రయత్నించింది.కాని భౌతికంగా కాక సోషల్ మీడియా అస్త్రాన్ని ఉపయోగించింది.
"""/"/ బీజేపీ సోషల్ మీడియాలలో టీఆర్ఎస్ వ్యతిరేక పోస్టులు పెడుతూ పెద్ద ఎత్తున ధర్నా ఫలితం బీజేపీపై పడకుండా జాగ్రత్త పడింది.
అయితే బీజేపీ సోషల్ మీడియా అస్త్రాన్ని ప్రయోగించినా అది ప్రజల్లోకి వెళ్లని పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం బీజేపీ క్షేత్ర స్థాయిలో కార్యవర్గం పెద్ద ఎత్తున లేని పరిస్థితిలో సోషల్ మీడియా అస్త్రాన్ని పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం.
అయితే కెసీఆర్ వేసిన ఈ వ్యూహంతో పెద్ద ఎత్తున రైతులలో టీఆర్ఎస్ పట్ల ఒక సానుకూల దృక్పథం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అబ్బో, ఎంత మర్యాదో: జంటకు ఇబ్బంది కలగకూడదని వేచి ఉన్న పెంగ్విన్.. వీడియో వైరల్!