కర్ణాటకలో బీజేపీ షాక్.. మాజీ సీఎం రాజీనామా

కర్ణాటకలో బీజేపీ షాక్ తగిలింది.బీజేపీకి మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాజీనామా చేశారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే పదవితో పాటు బీజేపీ సభ్యత్వానికి కూడా షెట్టర్ రాజీనామా చేశారు.మరి కొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా బీజేపీకి ఇది ఎదురుదెబ్బనే చెప్పుకోవచ్చు.

అయితే ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం అయినప్పటికీ షెట్టర్ కు టికెట్ లభించలేదని సమాచారం.

దీంతో తీవ్ర అసహనం, అసంతృప్తికి లోనైన షెట్టర్ బీజేపీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.

ఫ్రాన్స్‌లో భయానక ఘటన.. లగ్జరీ లాడ్జిలో ఉంటున్న మహిళపై తోడేళ్లు దాడి..??