ప్రత్యర్ధులు శభాష్ అంటున్నారే ? జగన్ మామూలోడు కాదే ?

తనకు ఎన్ని ప్రశంసలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, జగన్ మాత్రం ఎక్కడా కంగారు పడటం లేదు.

తాను ఏం చేయాలి అనుకుంటున్నాడో అది చేసి చూపిస్తున్నాడు.వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా, జగన్ మాత్రం తాను పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలు స్వయంగా చూసి తెలుసుకోవడంతో అప్పుడు ఇచ్చిన హామీలన్నీ వరుసగా అమలు చేసి చూపిస్తున్నారు.

ప్రజా సమస్యల విషయంలో తనకు పూర్తిగా అవగాహన ఉండడంతో జగన్ ప్రజలకు ఏం కావాలో ముందుగానే గ్రహించి ఎవరు ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు.

ఖజానాకు భారమైన, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఆయన వెనక్కి తగ్గడం లేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతోంది.ఆయన ఈ సమయంలోనూ ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నారు.

జగన్ తన క్యాంపు కార్యాలయంలోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.ఒకవైపు కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలోనే విశాఖలో గ్యాస్ లీక్ అయిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

భోపాల్ గ్యాస్ లీకేజీ తర్వాత అతిపెద్ద సంఘటనగా విశాఖ లో గ్యాస్ లీకేజ్ సంఘటనను ఇప్పుడు నిపుణులు గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.జగన్ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయంలో జగన్ తీరు ప్రశంసిస్తున్నారు.

గ్యాస్ లీకేజ్ సంఘటనలో మృతిచెందిన ఒక్కొక్కరికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు.

చరిత్రలో ఎప్పుడు ఎక్కడా ఇంత పరిహారం ఇచ్చిన సంఘటన జరగలేదని విపక్షాలు సైతం జగన్ తీరును మెచ్చుకుంటున్నాయి.

"""/"/ మృతులకు కోటి రూపాయలు, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి పది లక్షలు, రెండు రోజులు చికిత్స చేయించుకునే వారికి లక్ష రూపాయలు, ఆసుపత్రిలో చేరినవారికి 25 వేలు, గ్యాస్ ప్రభావం ఉన్న ఐదు గ్రామాలకు చెందిన 15 వేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం కూడా జగన్ ప్రకటించారు.

దీంతో ఒక్కసారిగా జగన్ సహాయంపై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది.విపక్షాలు సైతం దీనిపై ఎటువంటి విమర్శలు చేసే సాహసం చేయలేకపోయింది.

అందరికంటే ముందుగా ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో పాటు విశాఖ బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జగన్ పై ప్రశంసలు కురిపించారు.

అసలు తాను కోటి రూపాయల సహాయం చేస్తారని ఊహించలేదు అంటూ విష్ణుకుమార్ రాజు జగన్ ను ప్రత్యేకంగా పొగిడారు.

అయితే జగన్ మాత్రం తాను ఈ సంఘటనను మానవీయ కోణంలో చూసి ఆ కుటుంబాలకు అండగా నిలబడాలనే ఈ విధంగా సహాయాన్ని ప్రకటించానని జగన్ తన సన్నిహితుల దగ్గర వెల్లడించారట.

మొత్తానికి జగన్ చేసిన సహాయం తో ఒక్కసారిగా విపక్షాల నోరు మూత పడటంతో పాటు, తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ నిర్ణయాన్ని సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రేమలో ఫెయిల్ అయితే అలా మాత్రం చేయొద్దు.. పూరీ జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!