బీజేపీ స్వయంకృపరాధం ! బాధ్యుడు వీర్రాజేనా ? 

దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.కర్ణాటకలో ఆ కోరిక తీరింది.

తెలంగాణలో ఆ కోరిక తీరేలాగే కనిపిస్తోంది.గతంతో పోలిస్తే అక్కడ బిజెపి బాగా బలం పెంచుకుంది.

టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బలోపేతం అయింది.దానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చేసిన కృషే కారణం.

దీనికి తోడు బిజెపి పెద్దలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి తగిన విధంగా ప్రోత్సాహం అందించడంతోనే అదంతా సాధ్యమైంది.

కానీ ఏపీలో బీజేపీ పరిస్థితి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు గా ఉంది .

మొదటి నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని బిజెపి బండి లాక్కొస్తుంది.

ఇప్పటి వరకు ఏపీలో బిజెపి సొంతంగా ఎక్కడ గెలవలేని పరిస్థితి.ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కాస్తో.

కూస్తో సీట్లను సంపాదించుకోవడం ఆ పార్టీకి అలవాటయింది.ఇక 2014 ఎన్నికల్లో టిడిపి , జనసేన, బిజెపిలు ఉమ్మడిగా పోటీ చేశాయి.

ఆ తర్వాత మూడు పార్టీల మధ్య విభేదాలు తలెత్తి విడివిడిగానే ఉంటూ వచ్చారు.

ఇక 2019 ఎన్నికల ఫలితాల తరువాత జనసేన బీజేపీ మధ్య పొత్తు కుదిరింది.

జనసేన సహకారంతో బిజెపి ఏపీలో బలోపేతం కావడంతో పాటు,  రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వస్తాయని అంత భావిస్తూ వస్తుండగా,  ఇప్పుడు రెండు పార్టీలో మధ్య పొత్తు అనధికారికంగా రద్దయింది.

బిజెపి జనసేన ఉమ్మడిగా ఏపీలో పెద్దగా చేసిన కార్యక్రమాలు ఏవి లేవు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మాను ఉపయోగించుకుని బిజెపి ఏపీలో బలపడే అవకాశం ఉన్నా.

  ఆ దిశగా ప్రయత్నాలు చేయలేకపోయింది.  జనసేన ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే అంతటి సత్తా లేకపోయినా , ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు, పవన్ అభిమానులు అంతా బీజేపీ కి వెన్నుదన్నుగా ఉండే వారు.

కానీ జనసేన ను సరిగా ఉపయోగించుకోవడంలో బిజెపి విఫలమైందనే విమర్శలు ఇప్పుడు సొంత పార్టీ నాయకులు నుంచి వినిపిస్తున్నాయి.

  """/"/ ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా విమర్శలు చేస్తున్నారు.

పవన్ ను కలుపుకొని వెళ్లే విధంగా సోము వీర్రాజు పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడం,  రెండు పార్టీలు ఎడ ముఖం, పెడ ముఖం అన్నట్లుగా విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లడం, జనసేన ను పట్టించుకోనట్టుగా బిజెపి , బిజెపిని పట్టించుకోనట్టుగా జనసేన వ్యవహరించడం వంటి వ్యవహారాలు ఎన్నో ఈ రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచాయి.

ప్రత్యక్షంగాను , పరోక్షంగాను జనసేనకు బిజెపి దూరమవ్వడానికి కారణం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

విజయ్ సక్సెస్ సాధిస్తే ఏపీ వరకు రీసౌండ్.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!