సీఎం జగన్‎పై బీజేపీ ప్రజా ఛార్జ్‎షీట్..!

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా మండిపడ్డారు.

కేంద్ర పథకాలను తమ సొంత పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.గ్రామాల్లో మరుగుదొడ్లు, గృహాలు, ఆర్బీకేల నిర్మాణాలు అన్నీ కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని సోము వీర్రాజు తెలిపారు.

ఒక్క అభివృద్ధిలో కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు.ఉత్తరాంధ్రలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని పేర్కొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీసిన సీఎం జగన్ పై ప్రజా ఛార్జ్ షీట్ వేస్తున్నామని వెల్లడించారు.

‘హరిహర వీరమల్లు’ సినిమా మీద హైప్ పెంచుతున్నారా..?