ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రం వ‌ద్ద ధర్నాకు దిగిన బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు..!!

నెల్లూరు ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రం వ‌ద్ద ఆందోళనలు చేపడుతున్న కార్మికులకు మద్దతుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ నాయకులతో .

కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు.ధర్మ పవర్ ఉత్పత్తి కేంద్రం ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో.

ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఒకవేళ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని.

కార్మికుల తరఫున బిజెపి పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పరిశ్రమ నష్టాలకు గల కారణాలు విషయంలో.

కార్మికులు స్థానిక ప్రజా ప్రతినిధులను నిలదీయాలని పేర్కొన్నారు.ధర్మవరం ఉత్పత్తి కేంద్రం విషయంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు.

ఇక ఇదే సమయంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించరు.

ఈ క్రమంలో స్థానిక పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది.ఏది ఏమైనా నెల్లూరు జిల్లా ప్రజల పట్ల ఏపీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

బలగం, మల్లేశం, జాతిరత్నాలు, కోర్ట్.. సినిమాల ఎంపికలో ప్రియదర్శికి తిరుగులేదుగా!