ఓ దొంగను అడ్డం పెట్టుకొని బీజేపీ ఆటలాడుతుంది:జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా:శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో టీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా మంత్రి జగదీష్ రెడ్డి,జిల్లా ఇంచార్జి,ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హాజరయారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోడీ,అమిత్ షా లు కేసీఆర్ పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో అమలుయ్యే పథకాలు నువ్వు ఎందుకు అమలు చేయడం లేదని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు.

అందుకే మోడీ తెలంగాణపై విషం కక్కుతున్నారని,గుజరాత్ రైతులకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే 6 గంటల కరంట్ కు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని,మరి తెలంగాణలో కేసీఆర్ రైతున్నలకు 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నారని తెలిపారు.

నువ్వు ఎందుకు ఇయ్యవని గుజరాత్ రైతులు మోడీని ప్రశ్నిస్తున్నారని,ఆసరా పెన్షన్ లు కూడా తెలంగాణలో ఇచ్చినట్లుగానే ఇవ్వాలని దేశ ప్రజలు మోడీని నిలదీస్తున్నారని,దేశంలో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు లేవనే మోడీ కేసీఆర్ పై కక్ష్య కట్టిండని విమర్శించారు.

అందుకే ఎలాగైనా కేసీఆర్ పని పట్టాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు.దేశంలోని రైతు నాయకులు కేసీఆర్ ను కలుస్తున్నారని, రైతుబంధు,రైతు భీమా పథకాలను పొగుడుతున్నారని,అందుకే కేసీఆర్ అంటే బీజేపీ వాళ్ళు భగ్గుమంటున్నరని చెప్పారు.

రాజగోపాల్ రెడ్డి అనే ఓ దొంగను అడ్డం పెట్టుకొని,బీజేపీ వాళ్ళు కుట్రలకు తెరలేపారని,మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీని తరిమి కొట్టాలని,సైనికుల వలె పోరాటం చేసి బీజేపీని తుక్కుతుక్కుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తూ,గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారని, గులాబీ జెండా కప్పుకొని,అభివృద్ధిలో భాగమవుతున్నామని గర్వంగా సంతోష పడుతున్నారని అన్నారు.

సందర్భం ఏదైనా కేసీఆర్ బాటలో నడవాలని,జన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పాలన అందించి,తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు.

కేసీఆర్ సచ్చుడో,తెలంగాణ వచ్చుడో అని నినదించి, పోరాటం చేసిన ధిరోదాత్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని,14 ఏళ్ళు పోరాడి తెలంగాణను సాధించారని, సాధించిన తెలంగాణలో సబ్భoడ వర్గాల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు కేసీఆర్ ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు.

తన అద్భుతమైన పాలనతో 5 ఏళ్లలోనే తెలంగాణను దేశంలో నంబర్ స్థానంలో నిలిపారని,24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తూ అద్భుతం చేశారని తెలిపారు.

ఇవ్వాళ మన తెలంగాణ దేశంలో అత్యధిక వ్యవసాయ దిగుబడులు సాధించి రికార్డు నెలకొల్పిందన్నారు.

ఆనాడు ఫ్లోరైడ్ మహమ్మారితో మునుగోడు అవస్థలు పడ్డా ఎవ్వరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

ఆనాటి బీజేపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని,తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించి,భగీరథ పథకానికి ఇక్కడే శ్రీకారం చుట్టి ఫ్లోరైడ్ ను తరిమి కొట్టారని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషితో ఇప్పుడు మునుగోడులో ఎటు చూసినా పచ్చగా సస్యశ్యామలం అయిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య,ఫైళ్ల శేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి22, బుధవారం 2025