బీజేపీ అంతపని చేయబోతోందా ..? ఏపీలో అవినీతిపై సీబీఐ కి ఫిర్యాదు చేస్తారా ..?

బీజేపీ టీడీపీకి మధ్య రాజకీయ వైరం వచ్చినప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది.

ఒకరి లూప్ హొల్స్ మరొకరు బయటపెట్టుకుంటూ.రచ్చ రచ్చ చేసుకుంటున్నారు.

అలాగే ఏపీలో టీడీపీ ప్రభుత్వం అవినీతి చేస్తోందని.వైసీపీ, జనసేన కూడా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా సీఎం చంద్రబాబు పథకాలు అన్ని కేంద్రం నుంచి నిధులు వచ్చిన వాటికి కూడా చంద్రన్న పథకాలుగా ప్రచారం చేసుకున్నారని, ఏపీకి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా అన్నింటిని ఏపీ సర్కారు ఖాతాలో తెలుగుదేశం పార్టీ వేసుకుంది అని బీజేపీ ప్రధాన ఆరోపణ.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గతంలో టీడీపీ- బీజేపీ పొత్తు ఉండడంతో ఇది పెద్దగా పట్టించుకోలేదు.

కానీ పరిస్థితి మారడంతో.ఇప్పుడు ఏవ్ అంశాలపై బీజేపీ గుర్రుగా ఉంది.

అలాగే.ఏపీలో తెలుగుదేశం పార్టీ పై ఎన్ని విమర్శలు వస్తున్నా వాటిని తిప్పికొట్టడంలో తెలుగుదేశం నాయకులు విఫలం అయ్యారు.

!--nextpage టీడీపీ - బీజేపీ పొత్తు ఉన్నప్పుడే.బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం పనులను కార్యక్రమాలలో అవినీతిని విమర్శించేవారు.

ఇక ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ మరింత తెలుగుదేశం పై విమర్శలు చేస్తుంటే, ఇటు తెలుగుదేశం కూడా బీజేపీ పై విమర్శల దాడి పెంచింది.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు.

నీరు-చెట్టు, హౌసింగ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు.చంద్రబాబు పులి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే.

కేవలం హౌసింగ్‌లోనే 30 కోట్ల దోపిడి జరిగిందని ఆరోపించారు.అలాగే ఏపీ ప్రభుత్వం చేసిన అవినీతి వ్యవహారాలకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు.

త్వరలోనే ఏపీలో జరిగిన అవినీతి వ్యవహారాలకు సంబంధించి సీబీఐ కి కంప్లైంట్ చేసే ఆలోచనలో కమలనాధులు ఉన్నట్టు తెలుస్తోంది.

రుణమాఫీపై తీపి కబురు అందేనా…?