తెలంగాణ టూ ఢిల్లీ ! కాక రేపుతున్న రాజకీయం

రోజు రోజుకు తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఒక పార్టీపై మరో పార్టీ పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో తలపడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో మూడు ప్రధాన పార్టీలైన బిజెపి, బీఆర్ఎస్ , కాంగ్రెస్ లు ఉన్నాయి.

మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణలో బిజెపి జెండా ఎగరవేయాలనే పట్టుదలతో బిజెపి ఉంది .

తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు ఈసారైనా ప్రజలు పట్టం కడతారనే ఆశతో కాంగ్రెస్ ఉంది.

ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం బీఆర్ఎస్ ను కుదిపేస్తోంది.ఈ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడం, ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేయడం వంటి వ్యవహారాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ప్రస్తుతం ఈరోజు కవిత ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా దీక్ష కార్యక్రమం జరగబోతుంది.చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, దానిని పార్లమెంట్ లో ఆమోదింప చేయాలని కోరుతూ కవిత దీక్షను చేపట్టారు.

దీనికి అన్ని పార్టీల నుంచి మద్దతును కూడగట్టారు.భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉండగా, ఈ వ్యవహారంలో కవితను మరికొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది.

"""/" / ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితకు సన్నిహితుడుగా పేరుపొందిన రామచంద్ర పిళ్లే అప్రూవల్ గా మారారని,  తాను కవిత బినామినని ఆయన ఒప్పుకున్నారని,  ఈడి అధికారు లు పేర్కొనడంతో, ఈ కేసు మరింత మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇక కవిత దీక్షకు పోటీగా బిజెపి కూడా ఈరోజు మరో ఆందోళన కార్యక్రానికి పిలుపునిచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ హైదరాబాదులో దీక్షకు ప్లాన్ చేసింది.

నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలోని ఈ దీక్షను చేయబోతున్నారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారు.

"""/" / ప్రస్తుతం పాదయాత్ర చేపడుతున్నారు.కరీంనగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

దీనికి కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి మానిక్ రావు ఠాక్రే , చతిస్గడ్ సీఎం భూపేష్, ఏఐసిసి కార్యదర్శి జయరాం రమేష్ హాజరవుతున్నారు.

ఈ విధంగా అన్ని పార్టీలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్పీడ్ పెంచాయి.

ఈఫిల్ టవర్ ముందు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రొమాంటిక్ ప్రపోజల్.. వీడియో వైరల్..