ఏపీలో కొత్త పొత్తులు..ఊహించని ట్విస్ట్ లు..!!
TeluguStop.com
ఏపీలో రాజకీయాలు కొత్త రూపుని సంతరించుకున్నాయి.తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దించడానికి ఎలాగైతే బద్ద శత్రువులు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలు కలిసాయో అదేవిధంగా ఏపీలో చంద్రబాబు ని అధికారం నుంచీ దించేయడానికి ఇప్పుడు కొత్త పత్తులు తెరపైకి వస్తున్నాయి.
భవిష్యత్తులో ఈ పొత్తుల వలన లాభపడేది ఎవరు.ఎవరికి ఈ పొత్తుల ఎత్తులు కలిసి రానున్నాయి అనే వివరాలలోకి వెళ్తే.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఏపీలో బాబు ని ఇంటికి సాగనంపడానికి బీజీపీ సరికొత్త వ్యుహాలని రచిస్తోంది.
జనసేనాని తో జట్టు కట్టి ఎన్నికల గోదారిని ఈదాలని భావిస్తోంది.పవన్ తో కలవడం వల్ల సినిమా గ్లామర్ రావడమే కాకుండా జనాలు వెల్లువలా వచ్చి పడుతారు.
అంతేకాదు జనసేననికి ఎంతో క్లీన్ ఇమేజ్ కూడా ఉంది.అన్నటికంటే ముఖ్యంగా ప్రజలు కోరుకునే విధంగా ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా మచ్చలేని నాయకుడు పవన్ ఒక్కడే అని తెలిచిందట.
దాంతో పవన్ కి ఉన్న అనూహ్యమైన ఆదరణ ని ఉపయోగించుకుని.తన అనుభవాన్ని ఎంతో బలమైన బీజేపీ క్యాడర్ ని ఏపీలో వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పాలని ఫిక్స్ అయ్యాయి.
అందుకోసం బీజేపీ నేతలు పక్కగా ప్లాన్ వేస్తున్నారని విస్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇదిలాఉంటే పవన్ బీజేపీతో కలుస్తాడా లేదా అంటే తప్పకుండా కలుస్తాడనే చెప్పాలి.ఎందుకంటే బీజేపీ అంటే పవన్ కి ఓ పాజిటివ్ అభిప్రాయం ఉంది.
తెర చాటు మంతనాలు కూడా జరిగాయట.ఇక పవన్ ముఖ్యంగా చూసేది బీజేపీ కి అత్యంత బలమైన ఆరెసెస్ క్యాడర్ బలం.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అంతేకాక వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ బీజేపీ కి అధికారం రావడం ఖాయమని తెలిసిన సమయంలో పవన్ సైతం బీజేపీ తో చెలిమికి సై అనే అవకాశమే ఎక్కువగా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.
అయితే ఒక్క ప్రత్యెక హోదా విషయంలో గనుకా బెజీపీ క్లారిటీ ఇస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు తప్పకుండా పెట్టుకుంటాడని టాక్ వినిపిస్తోంది.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో అంటకాగుతారో వేచి చూడాల్సిందే.
బాలయ్యకు పద్మభూషణ్ రావటం ఆ హీరోకి నచ్చలేదా… అందుకే సైలెంట్ గా ఉన్నారా?