ఆమెపై బీజేపీ అధినాయకత్వం సీరియస్‌

గత కొన్నాళ్లుగా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి పెద్ద భారంగా మారిపోయాయి.

బీజేపీ ఎంపీ అయిన ప్రజ్ఞా గతంలో హిందుత్వంకు సంబంధించిన వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందులు తెచ్చి పెట్టింది.

ఇప్పుడు ఏకంగా గాంధీజీని చంపిన వ్యక్తిని మంచివాడు అని, దేశ భక్తుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తింది.

ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలకు బీజేపీ సిద్దం అయ్యింది.

ఆమెను పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలంటూ కొందరు నాయకులు డిమాండ్‌ చేస్తుండగా, ఆమెను పార్లమెంటు నుండి ఈ సెషన్స్‌ వరకు సస్పెండ్‌ చేయాలని బీజేపీ భావిస్తుంది.

బీజీపీ పార్లమెంటరీ సమావేశానికి కూడా ఆమెను ఆహ్వానించకూడదని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నడ్డా నిర్ణయం తీసుకున్నాడు.

మోడీ కూడా ఇప్పటికే ఆమెపై సీరియస్‌గా ఉన్నాడు.ప్రభుత్వం మరియు పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే కఠిన శిక్షలు తప్పవంటూ మొదటి నుండి చెబుతున్నా కూడా ఆమె మాత్రం ఎంత మాత్రం వెనక్కు తగ్గకుండా గాడ్సేపై సంచనల వ్యాఖ్యలు చేసి దేశ భక్తుడు అనేసింది.

ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని పార్టీకి సంబంధం లేదు అంటూ బీజేపీ నాయకత్వం ప్రకటించింది.

ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య గొడవ ఏంటి ? 20 ఏళ్లు ఎందుకు మాట్లాడుకోలేదు ?