అప్పుడేంత ఇప్పుడెంత ! బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుట్టు విప్పనున్న బీజేపీ ?
TeluguStop.com
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఇరుకును పెట్టే విధంగా బిజెపి( BJP ) ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో అయినా, బీఆర్ఎస్ ను ఓడించాలనే పట్టుదలతో ఉంది.
ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చే విధంగా అనేక ప్లాన్ లు వేస్తున్నారు.తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడంతో, ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంతోపాటు ,బిజెపికి ఆదరణ పెరిగే విధంగా అనేక ప్లాన్లు వేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే( BRS MLAs )లు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని నిరూపించాలని నిర్ణయించుకుంది.
"""/" /
దీనిలో భాగంగానే బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారట.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉన్న ఆస్తులు ఏమిటి ? ఆదాయ మార్గాలు , 2018 ఎన్నికల్లో వారు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు, గడిచిన నాలుగు నెలల్లో వాటి పెరుగుదల ఎంత ? ఇతర అవినీతి వ్యవహారాల ద్వారా సంపాదిస్తున్న సొమ్ముల వివరాలు, ఇలా అన్నిటిని సేకరించి ఆధారాలతో సహా బయట పెట్టేందుకు బిజెపి ప్లాన్ చేసుకుంటుందట.
దీనికోసం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది.ఇటీవల కాలంలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో బిజెపి గందరగోళానికి గురవడం తదితర పరిణామాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలను బయటకు తీయడం ద్వారా, బిజెపి కార్యకర్తలలోను ఉత్సాహం పెంచాలని బిజెపి అధిష్టానం నిర్ణయించుకుంది.
"""/" /
2018 అధికారిక లెక్కలను సేకరించి వాటి ఆధారంగా గడిచిన నాలుగేళ్లలో ఒక్కో ఎమ్మెల్యే ఎంత మేరకు ఆస్తులు కూడబెట్టారు అనే విషయాలను బయటకు తీయాలని, ఏ ఎమ్మెల్యే ఆస్తులు ఏ మేరకు పెరిగాయి అనే విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా, బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాలను వెలికి తీయవచ్చనే లెక్కల్లో బిజెపి ఉందట.
ఈ మేరకు తెలంగాణలోని కీలక నాయకులందరికీ ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.త్వరలోనే ఈ వివరాలన్నీ బయటపెట్టి రాజకీయంగా సంచలనం సృష్టించేందుకు బిజెపి సిద్ధమవుతోంది.
పాలల్లో ఇవి కలిపి తీసుకుంటే రోగాలు మీ దరిదాపుల్లోకి కూడా రావు!