జగన్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ నయా ప్లాన్.. కొత్త పొత్తుకు రంగం సిద్ధం!

ఏపీ రాజకీయాలు ఊహించిన దానికంటే మరింత వేగంగా మారుతున్నాయి.ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మిగిలి ఉండగానే ఇప్పటి నుంచే పొత్తులకు ప్రధాన పార్టీలు అర్రులు చాస్తున్నాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నది.

అందుకు తగినట్టుకుగా సీఎం జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల్లో ఎవరిమీద అయిన వ్యతిరేకత వస్తే వారికి టికెట్ ఇచ్చేది లేదని నిర్మోహమాటంగా చెప్పినట్టు ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇక రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా పొత్తులకు సై అంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్రలోని బీజేపీ మరోసారి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సై అంటున్నట్టు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం కేంద్రానికి జగన్ పరోక్షంగా మద్దతినిస్తున్న 2024లో జరిగే ఎన్నికల్లో అన్ని175 సీట్లు అన్నింటిని కైవసం చేసుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.

అనుకున్నంత మాత్రాన సాధ్యం అవుతుందా? అంటే కాకపోవచ్చు.కానీ జగన్‌ను మాత్రం తక్కువ అంచనా వేయద్దని మోడీ షా ద్వయం భావించినట్టు సమాచారం.

"""/"/ ఏపీలో బీజేపీకి పెద్దగా ఆదరణ లేదని భావిస్తున్న మోడీ షా ద్వయం తెలుగుదేశం పార్టీతో మరోసారి పొత్తుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రన్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగితే అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే జనసేన కూడా బాబుతో కలిసి వస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం జనసేన, బీజేపీ మధ్య స్నేహం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్‌ను గద్దె దించవచ్చని బీజేపీ భావిస్తోంది.

"""/"/ వైసీపీ ప్రభుత్వానికి మరోసారి అధికారం కట్టబెట్టడం కంటే పొత్తులతో ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకోవాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ భావిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోడీని కలిసిన విషయం తెలిసిందే.నిజంగా ఆ మీటింగ్ పొత్తుకు దారితీసినట్టు అయితే రాబోయే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉన్నది.

ఒకవేళ బీజేపీ ఎక్కువ లోక్‌సభ స్థానాలను కోరితే అవి ఇచ్చేందుకు కూడా బాబు సన్నద్ధంగా ఉన్నట్టు సమాచారం.

ఎలాగైనా జగన్ ను గద్దెదించాలని చంద్రబాబు వర్కౌట్స్ చేస్తున్నట్టు పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

కాగా, బీజేపీ తెలుగుదేశం మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

H1B Visa Lottery : ముగిసిన హెచ్ 1 బీ వీసా లాటరీ ప్రక్రియ