బురదలో కూర్చుని శంఖం ఊదితే `కరోనా` రాదంటున్న బీజేపీ ఎంపీ!
TeluguStop.com
కరోనా వైరస్.ఎప్పుడు ఏ రూపంలో వచ్చి ఎటాక్ చేస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
చైనాలో వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైరస్.అనతి కాలంలోనే ప్రపంచదేశాలు వ్యాపించింది.
రోజులు తరబడి లాక్‌డౌన్ విధించినా.కరోనా మాత్రం అదుపులోకి రాలేదు.
దీంతో దేశాలన్నీ అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాయి.ఈ క్రమంలోనే రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఏడు లక్షల మించిపోగా.పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటేసింది.
అయితే కరోనా వేగంగా విజృంభిస్తున్న వేళ బీజేపీ నేతలు ఇస్తున్న సలహాలు, సూచనలు అభాసుపాలవుతున్నాయి.
ఇటీవల ఆవు పంచకంతో కరోనా నయమవుతుందని, అప్పడాలు తింటే కరోనా నుంచి రక్షణ పొందొచ్చని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
"""/"/
అయితే తాజాగా రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ జౌనపురియా కూడా తనవంతుగా ఓ సలహా ఇచ్చి నవ్వులపాలయ్యారు.
ఇంతకీ ఆయన సలహా ఏంటీ అంటే.బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా రాదంటున్నారు.
ఇలా చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, తద్వారా కరోనాపై పోరాడే శక్తి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఇలా చెప్పడమే కాకుండా ఆయన స్వయంగా బురదలో కూర్చుని శంఖం ఊది అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ సుఖ్ బీర్ సింగ్ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా, గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఖ్ బీర్ సింగ్.శరీరానికి బురద పూసుకుని యోగా చేస్తే అన్ని వ్యాధులు నయమవుతాయని గతంలో చెప్పుకొచ్చారు.
భాష రాకున్నా ఫర్వాలేదు.. గుజరాత్ కుర్రాడి ప్రేమకు ఫిలిప్పీన్స్ పిల్ల ఫిదా.. ఆపై పెళ్లి!