తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి
TeluguStop.com

తిరుమల శ్రీవారిని బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.


ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.


అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి కోర్టులో డిఫర్మేషన్ కేసు టీటీడీ తరపున వేయడం జరిగిందన్నారు.
ఆంధ్రజ్యోతి పత్రికపై 100 కోట్ల రూపాయల పరువు నష్ట దావాను వేశాంమని,క్రిస్టియానిటీ తిరుమలకు తీసుకొచ్చారనే అవాస్తవాని ఆంధ్రజ్యోతి ప్రచురించిందని,ఇలాంటి అసత్య ప్రచారం సమాజానికి ప్రమాదకరంమన్నారు.
ఆంధ్రజ్యోతి ఛానెల్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగిందని ఆయన ఆయన తెలిపారు.
ఈ ఒక్క హీరోకి మాత్రమే పాన్ ఇండియాలో నెంబర్ వన్ అయ్యే అవకాశం ఉందా..?