నేను అన్నది నిజమే, ఆయన ఉగ్రవాదే

నేను అన్నది నిజమే, ఆయన ఉగ్రవాదే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆప్‌ మరియు బీజేపీల మద్య యుద్ద వాతావరణంను క్రియేట్‌ చేసింది.

నేను అన్నది నిజమే, ఆయన ఉగ్రవాదే

రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్‌ మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఢీ అంటే ఢీ అంటూ పోరాడబోతున్నాయి.

నేను అన్నది నిజమే, ఆయన ఉగ్రవాదే

ఈ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారా స్థాయికి చేరాయి.బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి మరీ ఆప్‌ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ముఖ్యంగా సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు మరియు వ్యక్తిగత విమర్శలు తారా స్థాయికి చేరాయి.

తాజాగా బీజేపీ ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కేజ్రీవాల్‌ ఒక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశాడు.

కేజ్రీవాల్‌ వంటి వారు సమాజానికి ప్రమాదం అన్నాడు.పర్వేష్‌ వ్యాఖ్యలపై ఆప్‌ ఈసీకి ఫిర్యాదు చేయగా స్పందించిన ఈసీ పర్వేష్‌ను 96 గంటలు ఎన్నికల్లో ప్రచారం చేయవద్దంటూ నిషేదించింది.

తనపై నిషేదం విధించినా కూడా ఆయన మాత్రం తగ్గడం లేదు.నేను అన్నదాంట్లో తప్పేం లేదు.

కేజ్రీవాల్‌ గురించి అన్ని తెలిసిన తర్వాత చాలా ఆలోచించి ఆయన ఒక ఉగ్రవాది అని వ్యాఖ్యలు చేశాను అంటూ ఆ ఎంపీ మళ్లీ మళ్లీ అదే మాట అంటున్నాడు.