ఏపీ రోడ్లపై బీజేపీ ఎంపీ బాపూరావు కీలక వ్యాఖ్యలు..!

ఏపీ రోడ్లపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

పాడేరులో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.80 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందన్న ఆయన నరకాన్ని తలపిస్తున్నట్లు రహదారులు ఉన్నాయన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో పాడేరు వాసులు విశాఖ పట్నానికి ఎలా ట్రావెల్ చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారని సమాచారం.

తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా ఉందని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాడేరు సహా ఇతర గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

కాగా పాడేరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వేలంలో కొనుగోలు చేసిన రూ.52 కోట్ల విలువైన అరటిపండును తిన్న వ్యాపారవేత్త