కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల విమర్శనాస్త్రాలు

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు.నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కేసీఆర్ ఎన్నికలను డబ్బుమయం చేశారని ఆరోపించారు.

వందల కోట్లు ఖర్చు పెట్టే సంస్కృతి తెలంగాణ చరిత్రలోనే లేదన్నారు.కానీ కేసీఆర్ డబ్బుతో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు.

బీజేపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి కేసీఆర్ లెంకలపల్లికి వస్తారట అంటూ ఎద్దేవా చేశారు.

ఇక్కడ ఓటు వేసేది మీ చుట్టాలు కాదు.మునుగోడు ప్రజలని ఈటల పేర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 4, బుధవారం 2024