ఓఆర్ఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఓఆర్ఆర్ టోల్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై పలు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

టెండర్లపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

లక్ష కోట్ల ఆదాయం వచ్చే టెండర్ పై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.

మిషన్ భగీరథ, కాళేశ్వరంకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు టోల్ టెండర్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదని డిమాండ్ చేశారు.

రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?