ఎలక్షన్స్ టైమ్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ !

ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ టైమ్ నడుస్తోంది.ఈ ఏడాది ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) మరోవైపు వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండడంతో  రాజకీయ వేడి కొనసాగుతోంది.

ముఖ్యంగా ఈసారి జరిగే ప్రతి ఎలక్షన్ బిజెపికి( BJP ) అత్యంతా కీలకంగా మారాయి.

ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

అందుకే తెలంగాణ, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలపై బిజెపి స్పెషల్ ఫోకస్ పెట్టింది.

"""/" / కాగా ఈ ఐదు రాష్ట్రాలల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆధారణ లేదనే చెప్పాలి.

రాజస్తాన్, మద్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బీజేపీ కొంత బలంగా ఉన్నప్పటికి అక్కడ కాంగ్రెస్( Congress Party ) ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అలాగే తెలంగాణలో బి‌ఆర్‌ఎస్,( BRS ) మిజోరాం లో ఫ్రంట్ ప్రభావం అధికంగా ఉంటుంది.

వీటిని దాటుకొని బీజేపీ విజయం సాధించడం అంతా తేలికైన విషయం కాదు.ఈ ఐదు రాష్ట్రాలలో గెలుపు కోసం అస్త్రశాస్త్రాలు రచిస్తోంది కమలం పార్టీ.

ఈ ఐదు రాష్ట్రాలలో ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వస్తే.2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంది.

దానికి తోడు మణిపూర్ అంశం మోడి సర్కార్ పై మరింత వ్యతిరేకత పెరిగేలా చేస్తోంది.

దాంతో ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి బీజేపీ అధిష్టానం ముందస్తు ఎన్నికలకు సిద్దమౌతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

"""/" / ఈ ఏడాది చివర అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే బీజేపీకి కలిసొస్తుందనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉందట.

ఇక తాజాగా కేంద్ర ఎన్నికల కమిటీతో బీజేపీ అధిష్టానం సమావేశం అయింది.ఈ సమావేశంలో ప్రధాని మోడి తో( PM Narendra Modi ) పాటు హోమ్ మంత్రి అమిత్ షా, నడ్డా కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా ముందస్తు ఎన్నికల విషయమే చర్చించినట్లు తెలుస్తోంది.అయితే ముందస్తు ఎన్నికల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

మరి ముందస్తు ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఎంతమేర సహకరిస్తాయనేది ప్రశ్నార్థకమే.

మరి చూడాలి గెలుపే లక్ష్యంగా బీజేపీ వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో మరి.

మూన్‌వాక్ చేసిన నీటిగుర్రం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..