మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ మహిళా మోర్ఛా ధర్నా
TeluguStop.com
గుంటూరు: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ మహిళా మోర్ఛా ధర్నా.
బీజేపీ మహిళా మోర్ఛా ప్రధాన కార్యదర్శి సాధినేని యామిని.ఏపీలో రోజు రోజుకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం పాలసీనే మహిళల పై అఘాయిత్యాలకు కారణం.ఆదాయం కోసం మద్యం అమ్మకాలు పెంచే పనిలో ప్రభుత్వం ఉంది.
అఘాయిత్యాలకు పాల్పడే కేసులలో అత్యధికంగా వైసీపీ నేతలు, వాలంటీర్లే ఉన్నారు.హోం మంత్రులు మారుతున్నారు.
ఆడపిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు.ఆడపిల్లలపై ఎన్ని దాడులు జరుగుతున్నా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసం దగ్గరే మహిళలకు రక్షణ లేదు.గత ప్రభుత్వం పేకాటలు ప్రోత్సహించింది.
ఈ ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోంది.ఆడపిల్లపై అఘాయిత్యాలలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
కంటతడి పెట్టిస్తున్న వానర ప్రేమ..